షాద్‌నగర్: అన్యాయాన్ని, అణచివేతను ఎదిరించి హక్కుల కోసం ధైర్యంగా పోరాడిన వీరవనిత చాకలి ఐలమ్మ జీవితం సమస్త తెలంగాణ సమాజానికి ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని షాద్‌నగర్ మాజీ శాసనసభ్యులు వై. అంజయ్య యాదవ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ఆవరణలో ఉన్న చాకలి ఐలమ్మ జయంతి వేడుకలను పురస్కరించుకుని ఆమె విగ్రహానికి అంజయ్య యాదవ్ పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సాధారణ పేద కుటుంబం నుంచి వచ్చిన చాకలి ఐలమ్మ తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడంతో పాటు పేదలు, రైతులు, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం తెగించి పోరాడిన ధీరవనితగా చరిత్రలో నిలిచిపోయారని కొనియాడారు. అన్యాయానికి ఎప్పుడూ తలొగ్గకుండా హక్కుల సాధన కోసం ఆమె సాగించిన పోరాట పటిమ నేటి తరానికి నిత్య స్ఫూర్తినిస్తోందని పేర్కొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగేందుకు, సామాజిక న్యాయం కోసం ధైర్యంగా నిలబడేందుకు ఐలమ్మ జీవితమే గొప్ప మార్గదర్శకమని అభిప్రాయపడ్డారు. సమాజంలో సమానత్వం, ఆత్మగౌరవం కోసం ప్రతి ఒక్కరూ ఆమె ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

inline-img

ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు వసంత శ్రీనివాస్, శారద శేఖర్, పిన్నమోని గోపాల్, మాజీ కౌన్సిలర్లు వెంకట్రాం రెడ్డి, కానుగు అంతయ్య, నందకిషోర్, నాయకులు రవి యాదవ్, నందిగామ శ్రీనివాస్, జుట్టు బాలరాజు, శ్రీను, కొండ మల్లేష్, జమాల్ ఖాన్ తదితరులతో పాటు రజక సంఘం నాయకులు పాల్గొని చాకలి ఐలమ్మకు నివాళులర్పించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 26 Sept 2026 | 12:30 PM IST
Tags: