హైదరాబాద్: రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపిన జీవో 97 విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం వెనక్కి తగ్గింది. విద్యార్థులు చేపట్టిన ఉధృత పోరాటాలకు తలొగ్గి ప్రభుత్వం ఎట్టకేలకు యూటర్న్ తీసుకుంది. స్కిల్డ్ యూనివర్సిటీలలో పాలిటెక్నిక్ విద్యార్థుల విలీన ప్రక్రియపై ప్రభుత్వం పూర్తిగా వెనుకడుగు వేసింది.

అలాగే శక్తి స్కీమ్‌లో ఉపాధ్యాయుల విలీనానికి సైతం బ్రేక్ పడింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, వివిధ వర్గాల నుంచి వ్యక్తమైన వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని పాలిటెక్నిక్ వ్యవస్థను యథావిధిగా సాంకేతిక విద్యా శాఖ పరిధిలోనే కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ నిర్ణయంతో విద్యార్థులలో నెలకొన్న ఆందోళనలకు తెరపడినట్లయింది.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 20 Sept 2026 | 10:30 PM IST
Tags: