షాద్నగర్: తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, వీరనారి చాకలి ఐలమ్మ 131వ జయంతి వేడుకలను రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. షాద్నగర్ మండల పరిషత్ కార్యాలయం ఎదుట కాంగ్రెస్ పార్టీ, రజక సంఘం, జేఏసీ (JAC) సంయుక్త ఆధ్వర్యంలో ఈ వేడుకలు కొనసాగాయి. ఈ కార్యక్రమానికి షాద్నగర్ శాసనసభ్యులు వీర్లప
ల్లి శంకర్, రజక సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు రామచందర్, రజక సంఘం జేఏసీ నాయకులు ముఖ్య అతిథులుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా వీరనారి చాకలి ఐలమ్మ చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి
ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ.. సమాజంలోని పేదలు,
పీడిత, తాడిత వర్గాల హక్కుల కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం సాహసోపేతంగా సాయుధ పోరాటం చేసిన గొప్ప ధీశాలి చాకలి ఐలమ్మ అని కొనియాడారు. ఆమె చూపిన పోరాట పటిమ, ఆత్మగౌరవ స్పూర్తి తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలోనే నిలిచిపోతుందని, నేటి తరానికి ఆమె జీవితం ఎంతో మార్గదర్శకమని పేర్కొన్నారు. ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బాబర్ అలీఖాన్, షాద్నగర్ తాలూకా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్ మూలే జనార్ధన్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ త్రిప్పిశెట్టి కరుణాకర్, కన్వీనర్ నక్క బాల్రాజ్ యాదవ్, ట్రెజరర్ గోర్ల రాము, జంగయ్య, కాంగ్రెస్ పార్టీ టౌన్ అధ్యక్షుడు నలమోని శ్రీధర్, చెంది తిరుపతిరెడ్డి, దంగు శ్రీనివాస్, రఘునాయక్ యాదవ్, కట్ట వెంకటేష్ గౌడ్, ఇబ్రహీం, ముబారక్ అలీ ఖాన్, టెలిఫోన్ వెంకటయ్య, ఏ. నర్సింలు, బి. నర్సింలు, దశరథ్, పరంజ్యోతి, కాశన్న, మంగలి బాలరాజు, మంగలి శ్రీను, ఏ. రంగయ్య, క్యూసెట్ శ్రీనివాస్, కౌన్సిలర్లు తదితరులు పాల్గొని నివాళులర్పించారు.


