కోల్సిటీటౌన్: మూడేళ్ల కాంగ్రెస్ పాలన వైఫల్యాలను ప్రశ్నిస్తూ రూపొందించిన ‘రామగుండం’ పోస్టర్ను బీజేపీ నాయకులు విడుదల చేశారు. ఆదివారం ఎఫ్సీఐ గౌతమినగర్లో నిర్వహించిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్య అరుణ్కుమార్ ఈ పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. మోసపూరిత వాగ్ధానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మూడు సంవత్సరాలు పూర్తవుతున్నప్పటికీ ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా పూర్తిస్థాయిలో నెరవేర్చలేకపోయిందని తీవ్రంగా విమర్శించారు. నియోజకవర్గంలో ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలు తీరు, అభివృద్ధి పనుల మందకొడి పరిస్థితిపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని తెలిపారు. ప్రజల సమస్యలను వెలుగులోకి తీసుకురావడంతో పాటు ప్రజా సమస్యలపై నిత్యం పోరాటం చేయడమే ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యమని స్పష్టంచేశారు.
ఈ కార్యక్రమంలో సుల్వ లక్ష్మీనర్సయ్య, మహావాది రామన్న, మామిడి రాజేష్, మాతంగి రేణుక, దాసరి శ్రీనివాస్, పెద్దపల్లి పవన్, శ్రీరాముల సత్యం, బాణాల రంజిత, మచ్చ విశ్వాస్, భారతి, పవన్, సతీష్, కొమ్మ స్వామి, సృజన, రజిత తదితరులు పాల్గొన్నారు.


