కొండూరు: కొండూరు గ్రామంలోని హైస్కూల్, గృహ నివాసాల మధ్య నుంచి వెళ్తున్న 11 కేవీ విద్యుత్ లైన్ ఎన్నో ఏళ్లుగా అపరిష్కృతంగా ఉండి గ్రామ ప్రజలకు, పాఠశాల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందికరంగా మారింది. విద్యార్థుల భద్రతకు, గ్రామ ప్రజల సౌకర్యానికి అత్యంత ప్రాధాన్యతనిస్తూ.. నేడు కొండూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ కేతూరి ధర్మతేజ, మాజీ సర్పంచ్ నల్లపోతుల గోపాల్ సమక్షంలో ఆ విద్యుత్ లైన్‌ను స్కూల్ కాంపౌండ్‌కు దూరంగా, వ్యవసాయ పొలాల అంచునకు విజయవంతంగా మార్చడం జరిగింది.

ఈ విద్యుత్ లైన్ మార్పుతో పాఠశాల విద్యార్థులకు, గ్రామ ప్రజలకు ఎంతో ఉపశమనం లభించిందని, భవిష్యత్తులో విద్యుత్ లైన్ వల్ల ఎలాంటి ప్రమాద పరిస్థితులు తలెత్తకుండా తగిన ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని గ్రామ సర్పంచ్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ వడ్డేమాన్ రాముడు, వార్డు సభ్యులు కావలి ఈశ్వరయ్య, రెడ్డి నరేష్, నాయకులు మీనిగా సత్యం, నల్లపోతుల కురుమయ్య, రెడ్డి సూగురి, డీలర్ కురుమయ్య, భాస్కర్, కేతూరి వేణు, మధు, శ్రీకాంత్, కోటేష్, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News
Follow us on Facebook, Twitter & Instagram.
Updated: 4 Sept 2026 | 11:47 PM IST
Tags: